రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక
కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్ :
రామారెడ్డి మండల కమిటీ మీ ఎన్నుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న ఆదేశాల మేరకు శుక్రవారం రామారెడ్డి మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకుల ఆధ్వర్యం లో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల ఉపాధ్యక్షు లు గా శ్రీనివాస్ రెడ్డి నారెడ్డి, ల్యాగల ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల ప్రధాన కార్యదర్శి ఎం డి రావుఫ్ కార్యదర్శి అటికె ల కిషన్ యాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు లక్కాకుల రాజశేఖర్,ముఖ్య సలహాదారులుగాతూర్పు రాజు, రంగు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నా రెడ్డి, పిప్పరి లింగం,వెంకట్ స్వామి, అరవింద్ గౌడ్, కిషన్ గౌడ్, ఠాగూర్, విజయ్ సింగ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.


