ఏకతాటి విధానాలకు వ్యతిరేకంగా గట్టి పోరాట తీర్మానం!
కామారెడ్డి,20 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) :
నిర్మాణ రంగాల కార్మిక సంఘం రామారెడ్డి మండ ల కమిటీ BNRKS భవన్‌లో జరిగిన అవగాహన సదస్సు సంచలన తీర్మానాలతో ముగిసింది. ము ఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్, జిల్లా కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్‌లు పాల్గొ న్నారు.సదస్సులో నాయకులు మాట్లాడుతూ, “ప్రతి కార్మికుడు సంఘంలో సభ్యత్వం తీసుకోవా లి. మన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చేయించుకుందాం” అని పిలుపు నిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకతాటి నిర్ణ యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,కార్మిక సంక్షేమ చట్టాలను ఎంత కొట్టి తెచ్చుకున్నా, వాటి ని ఎత్తేసి నాలుగు కోట్లలో తీసేశారు.కార్మికులు భారీ నష్టపోతున్నారని ఆరోపించారు.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నాయకులతోనూ, కార్మికు లతోనూ మాట్లాడకుండా సంక్షేమ ఫలాలకు గండి కొట్టి ప్రైవేటీకరణ చేస్తోందని తీవ్రంగా ఖండించా రు.అందరూ ఏకతాటిపై ఉన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.రాష్ట్ర నాయకత్వం పిలిచి నప్పుడు ప్రతి కార్మికుడు నిరసన తెలపడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.నిర్మాణ రంగాల్లో పని చేసే ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేయించుకోవాల ని సూచించారు. సదస్సులో సహాయక కార్మిక అధికారి ఖమ్రుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ లిపేల్లీ నారాయణ,జిల్లా మండల కమిటీ అధ్యక్షు లు బింగీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పుసలశివ, ప్రసార కార్యదర్శి ఉపల్వాయి గంగాధర్ నారాయ ణ, అన్నారం రాచమల్ల శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు దేమేరవి తదితర గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.


