కామారెడ్డి, 08 జనవరి 🙁 పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి మండలం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి. చంద్రశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరు అభి యోక్తులకు ఒక్కరోజు జైలు శిక్షతో పాటు 1,000 రూపాయల జరిమానా విధించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులు రోడ్డు భద్రతపై హెచ్చరికగా మారాయి.అభియోక్తుల వివరాలుము.బాలనరసింహులు (55 సంవ., చక్కిలా కులం, వ్యవసాయి), బవానిపేట (వి), మచారెడ్డి (మ).రామావత్ రమేష్ (32 సంవ., ST-లంబాడ కులం, వ్యవసాయి), డోంకల (వి), ఇంద ల్వాయి (మ).SHO పి.రాజశేఖర్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు విషయం తెలిపారు.డ్రంక్ డ్రైవింగ్‌కు ఎటువంటి తప్పించుకో లేని శిక్షలు విధిస్తాం అని పోలీసులు స్పష్టం చేశా రు. స్థానికులు ఈ శిక్షలను స్వాగతించుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు


