రామారెడ్డి పాలకవర్గం సభ్యులు జాతీయ నాయకుల విగ్రహాలకు అలంకరాలు!
కామారెడ్డి, 25 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
దేశ ఘణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని రామారెడ్డి గ్రామంలో ఉత్సాహం హృదయాలను కదిలించింది. గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపస ర్పంచ్ నవీన్‌ల నేతృత్వంలో పాలకవర్గం సభ్యులు జాతీయ నాయకుల విగ్రహాలకు ప్రత్యేకంగా రంగు లు వేయించారు.ఈ కార్యక్రమం గ్రామస్తుల్లో దేశ భక్తి భావాలను మరింత బలపరిచింది.ఆదివారం ఉదయం నుంచే రామారెడ్డి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు. సర్పంచ్ బండి ప్రవీణ్‌కు సహచరులైన ఉపసర్పంచ్ నవీన్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మొత్తం సమీపంలో ఏర్పడి మహాత్మా గాంధీ, శుభాష్ చంద్రబోస్, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్, నెహ్రూ వంటి జాతీయ నాయకుల విగ్రహాలకు విశేషంగా రంగు లు వేయించారు. తిరంగా గుండెల్లో దేశభక్తి మంచి పాటవుతుందని సర్పంచ్ ప్రవీణ్ అన్నారు.ఈ ఉత్సవాలు గ్రామంలో ఐక్యత, దేశభక్తిని పెంపొం దించాయి.మా గ్రామ పాలకులు దేశ స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం మేము గర్వపడుతున్నాం అని గ్రామస్తులు చెప్పుకొని సంతోషించారు. ఘణతంత్ర దినోత్సవం ద్వారా ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకున్నారు. రామారెడ్డి గ్రామ పాలకులు ఇలాంటి కార్యక్రమా లతో గ్రామీణ అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమా ల్లో ముందంజలో నిలుస్తున్నారు. ఈ ఘనోత్సవం గ్రామ ప్రజల్లో దేశభక్తి జ్వాలను రగిలించింది.


