కామారెడ్డి, 13 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ )గా రాజ శేఖర్ బదిలీపై వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించినట్లు సమాచారం.ఈ స్థానంలో ఇంత కు ముందు పనిచేసిన ఎస్ఐ ఆర్. లావణ్య బదిలీ అయ్యారు. ఆమె గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించినందున, పరిపాలనా విధుల్లో భాగంగా ఆమెను సోషల్ వెల్ఫేర్ శాఖకు బదిలీ చేస్తూ ఉన్న తాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది.కొత్తగా వచ్చిన ఎస్ఐ రాజశేఖర్ రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు.


