Saturday, 28 March 2026
  • Home  
  • రామారెడ్డిలో బిఆర్ఎస్ ఫైర్ డ్వాక్రా వాళ్లకే చీరలా! ..? – మిగతా మహిళలు లేనట్టేనా..?
- కామారెడ్డి

రామారెడ్డిలో బిఆర్ఎస్ ఫైర్ డ్వాక్రా వాళ్లకే చీరలా! ..? – మిగతా మహిళలు లేనట్టేనా..?

కాంగ్రెస్ చీరల పంపిణీపై బిఆర్ఎస్ ఫుల్ ఫైర్ అయింది. డ్వాక్రా మహిళలకే చీరలు ఇచ్చి, మిగతా మహిళలను పక్కనపెట్టడంపై బండారు ఎత్తింది. కామారెడ్డి, 25 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా ధ్వజ మెత్తారు. డ్వాక్రా మహిళలకే చీరలు పంపిణీ చేసి, ఇతర మహిళలను అవమానపరుస్తున్నారని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ ఎంసీఏ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ లు మండిప డ్డారు. డ్వాక్రాలో లేని మహిళలు మహిళలు కారా..? అందరి ఓట్లతో గద్దెెక్కి, ఇప్పుడు కొన్ని గ్రూపులకు మాత్రమే చీరలు పంచడం ఎంతటి న్యాయం?” అంటూ ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి చీరల పంపిణీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు.మండలంలో సుమారు 12 వేల మహిళలు ఉన్నా, కేవలం 7,500 చీరలే రావడం ఘోర నిర్లక్ష్యమని ఆయన ఎద్దేవా చేశా రు. ఇంకా దాదాపు 40 శాతం మహిళలకు చీరలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి మహిళకూ చీరలు ఇచ్చే వరకు బిఆర్ఎస్ వీధుల్లోకి వస్తుందని, అవసరమైతే ఆందోళనలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధమని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పథకాలను కత్తిరించా రని ఆరోపించా రు.ఎన్నికల సమయంలో కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఏ ఒకటీ నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, ప్రతి మహిళకు హక్కుగా చీర ఇవ్వాలని, లేకపోతే బిఆర్ఎస్ ప్రజలతో కలిసి మండలంలో ఉద్యమా న్ని జ్వాలలెత్తించేలా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సారె డ్డి, రైతు బంధు మాజీ జిల్లా డైరెక్టర్ రాజేంద ర్, మాజీ ఏఏంసీ డైరెక్టర్ సిద్దరాములు, బాల్ దేవ్, అంజయ్య, జంగం లింగం, హన్మోళ్ల రాజయ్య, ఇసాయపేట బైరయ్య, బాలమల్లు, దుబ్బాక లక్ష్మణ్, కుశనో.ల్లా రాజు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ చీరల పంపిణీపై బిఆర్ఎస్ ఫుల్ ఫైర్ అయింది. డ్వాక్రా మహిళలకే చీరలు ఇచ్చి, మిగతా మహిళలను పక్కనపెట్టడంపై బండారు ఎత్తింది.

కామారెడ్డి, 25 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులు తీవ్రంగా ధ్వజ మెత్తారు. డ్వాక్రా మహిళలకే చీరలు పంపిణీ చేసి, ఇతర మహిళలను అవమానపరుస్తున్నారని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాజీ ఎంసీఏ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ లు మండిప డ్డారు. డ్వాక్రాలో లేని మహిళలు మహిళలు కారా..? అందరి ఓట్లతో గద్దెెక్కి, ఇప్పుడు కొన్ని గ్రూపులకు మాత్రమే చీరలు పంచడం ఎంతటి న్యాయం?” అంటూ ఆయన ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారి చీరల పంపిణీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు.మండలంలో సుమారు 12 వేల మహిళలు ఉన్నా, కేవలం 7,500 చీరలే రావడం ఘోర నిర్లక్ష్యమని ఆయన ఎద్దేవా చేశా రు. ఇంకా దాదాపు 40 శాతం మహిళలకు చీరలు అందాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి మహిళకూ చీరలు ఇచ్చే వరకు బిఆర్ఎస్ వీధుల్లోకి వస్తుందని, అవసరమైతే ఆందోళనలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధమని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఆ పథకాలను కత్తిరించా రని ఆరోపించా రు.ఎన్నికల సమయంలో కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఏ ఒకటీ నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, ప్రతి మహిళకు హక్కుగా చీర ఇవ్వాలని, లేకపోతే బిఆర్ఎస్ ప్రజలతో కలిసి మండలంలో ఉద్యమా న్ని జ్వాలలెత్తించేలా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సారె డ్డి, రైతు బంధు మాజీ జిల్లా డైరెక్టర్ రాజేంద ర్, మాజీ ఏఏంసీ డైరెక్టర్ సిద్దరాములు, బాల్ దేవ్, అంజయ్య, జంగం లింగం, హన్మోళ్ల రాజయ్య, ఇసాయపేట బైరయ్య, బాలమల్లు, దుబ్బాక లక్ష్మణ్, కుశనో.ల్లా రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.