కామారెడ్డి, 23 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ భీమ వరం పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్‌ను అదుపులోకి తీసుకుని రామారెడ్డి పోలీ స్ స్టేషన్ కు తరలిస్తుండగా, గ్రామస్థులు వారిని వెంబడించి రామారెడ్డి పోలి స్టేషన్ వద్ద వాగ్వాదా నికి దిగారు.వాగ్వాదం తీవ్రరూపం దాల్చి పోలీసు ల విధులకు ఆటంకం ఏర్పడటంతో, రామారెడ్డి పోలీస్‌లు మద్దికుంట పది మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపా రు.ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. పోలీస్ భద్రతను బలోపే తం చేసినట్లు వివరించారు.


