కామారెడ్డి, 05 నవంబర్, (పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇ సన్న పల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం పరి ధిలోని దుకాణాల బహిరంగ వేలం పాట నిర్వ హిం చబడింది. వేదవిధానాలతో ప్రారంభమైన ఈ వేలం లో మొత్తం10 మంది డిపాజిట్లు చెల్లించారు. వేలం ప్రకారం కిరాణా, పూసవేర్లు, కూల్‌డ్రింక్స్, టెంకాయ ల దుకాణం మొదలైన వాటికి పోటీ పడి పాల్గొన్నా రు. చివరగా కిరాణ దుకాణం బండి జగన్నాథం (తండ్రి పేరు కిష్టయ్య, నివాసం రామకోండి) గారు సంవత్స రానికి రూ. 6,00,000/- (ఆరులక్షలు)కి కైవసం చేసుకున్నారు.అయితే ఆధ్యాత్మిక బుక్ స్టాల్, రుద్రాక్ష మాలల ఆర్టికల్స్ దుకాణం కోసం ఎవరూ వేలంలో పాల్గొనకపోవడంతో ఆ దుకాణం వేలం రద్దైంది.ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ నిజామాబాద్ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ సుమన్ పర్య వేక్షణలో ప్రశాంతంగా పూర్తయింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై స్థానిక భక్తులు స్పందిస్తూ, ఆదాయ వృద్ధికి అవి దోహదపడతాయని పేర్కొన్నారు.


