అంబేద్కర్ కోనసీమ: సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
పి.గన్నవరం నియోజకవర్గం తాటికాయల వారిపాలెం గ్రామంలోని శ్రీ దుర్గామల్లేశ్వరి ఆలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టాలని, ఎంపీ మిధున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు కావాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 450 మంది భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ పీసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్క చిన్న వెంకటేశ్వరరావు, కుమార రాజు, చింతపల్లి నరసింహారావు తదితరులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


