Friday, 27 March 2026
  • Home  
  • రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపే లక్ష్యంగా రాత్రి 10 నుంచి 1 గంట వరకు గస్తీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. మొత్తం ₹84,610 జరిమానా విధించారు. జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, శాంతిభద్రత పరిరక్షణ, రాత్రి వేళల్లో నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపు కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రివేళలో రాత్రి 10.00 గంటల నుండి రాత్రి 1.00 గంట వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిణ.  నేరాలను అరికట్టడమే కాదు, ముందే నివారించడమే లక్ష్యం.  ముఖ్యంగా అల్లరి మూకలు, గ్యాంగులు, రౌడీ మూకలు తిరగబోయే ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు.  గుర్తింపు లేని వ్యక్తులు, స్ట్రేంజర్స్, అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ. సరైన ఐడీ ప్రూఫ్ లేకుండా ఉండేవారి పై విచారణ చేసి అవసరమైతే చట్టపరమైన చర్యలు.  రాత్రివేళ తిరుగుతున్న వ్యక్తులను ఆపి, వారి గమ్యం, కారణాలు విచారణ. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేని వారిపై తగిన చట్టపరమైన చర్యలు.  రాత్రిపూట యువత గుంపులు గుమికూడే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక మొబైల్ పహారా. రౌడీ ఎలిమెంట్లు, ఈవ్ టీజింగ్, గ్యాంగ్ పోకడలను అరికట్టడమే లక్యం.  అవసరమైతే లాఠీ జులుపిస్తూ గస్తీ చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భయం లేని వాతావరణం సృష్టించడం. ప్రజలు రాత్రివేళల్లో సురక్షితంగా ప్రయాణించేలా సమగ్ర భద్రతా చర్యలు.  రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్ ఏరియాలు, చీకటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ.  కీలక జంక్షన్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేసి అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెలర్ వాహనాలపై ప్రత్యేకంగా తనిఖీలు. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్లపై MV Act ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాల సీజ్. బార్లు, రెస్టారెంట్లు మూసిన తరువాత బయటకు వస్తున్న వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు.  తేది.19.12.25 న జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి, ఓపెన్ డ్రింకింగ్-8 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 18 కేసులు, ఇ చలానా కేసులు 73 నమోదు, Rs.84,610/- ఫైన్ విధించారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపే లక్ష్యంగా రాత్రి 10 నుంచి 1 గంట వరకు గస్తీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. మొత్తం ₹84,610 జరిమానా విధించారు.
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, శాంతిభద్రత పరిరక్షణ, రాత్రి వేళల్లో నేరాల నివారణ, ప్రజల్లో భద్రతా భావం పెంపు కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రివేళలో రాత్రి 10.00 గంటల నుండి రాత్రి 1.00 గంట వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిణ.
 నేరాలను అరికట్టడమే కాదు, ముందే నివారించడమే లక్ష్యం.
 ముఖ్యంగా అల్లరి మూకలు, గ్యాంగులు, రౌడీ మూకలు తిరగబోయే ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు.
 గుర్తింపు లేని వ్యక్తులు, స్ట్రేంజర్స్, అనుమానాస్పద వ్యక్తుల వివరాల సేకరణ. సరైన ఐడీ ప్రూఫ్ లేకుండా ఉండేవారి పై విచారణ చేసి అవసరమైతే చట్టపరమైన చర్యలు.
 రాత్రివేళ తిరుగుతున్న వ్యక్తులను ఆపి, వారి గమ్యం, కారణాలు విచారణ. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేని వారిపై తగిన చట్టపరమైన చర్యలు.
 రాత్రిపూట యువత గుంపులు గుమికూడే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక మొబైల్ పహారా. రౌడీ ఎలిమెంట్లు, ఈవ్ టీజింగ్, గ్యాంగ్ పోకడలను అరికట్టడమే లక్యం.
 అవసరమైతే లాఠీ జులుపిస్తూ గస్తీ చేసి రాత్రి వేళల్లో ప్రజలకు భయం లేని వాతావరణం సృష్టించడం. ప్రజలు రాత్రివేళల్లో సురక్షితంగా ప్రయాణించేలా సమగ్ర భద్రతా చర్యలు.
 రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్ ఏరియాలు, చీకటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ.
 కీలక జంక్షన్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేసి అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రావెలర్ వాహనాలపై ప్రత్యేకంగా తనిఖీలు. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్లపై MV Act ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాల సీజ్. బార్లు, రెస్టారెంట్లు మూసిన తరువాత బయటకు వస్తున్న వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు.
 తేది.19.12.25 న జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి, ఓపెన్ డ్రింకింగ్-8 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 18 కేసులు, ఇ చలానా కేసులు 73 నమోదు, Rs.84,610/- ఫైన్ విధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.