Story highlights
- నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే రాజ్యాంగ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు తో…
- 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున రాజ్యాంగ దినోత్సవం అని జరుపుకుంటాం అని అన్నారు.
- రాజ్యాంగంలోని న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే నాలుగు ప్రధాన విలువలను ప్రతి భారతీయుడు తన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే రాజ్యాంగ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున రాజ్యాంగ దినోత్సవం అని జరుపుకుంటాం అని అన్నారు. రాజ్యాంగంలోని న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే నాలుగు ప్రధాన విలువలను ప్రతి భారతీయుడు తన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడి గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించబడతాయని పిలుపునిచ్చారు.అనేక అవమానాలు వివక్షలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు. అయన కలలు కన్నా భారతదేశం కుల వివక్ష లేని సమాజం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు బలహీన వర్గాలకు న్యాయం జరిగే ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం అంబేద్కర్ కృషి చేశారని అన్నారు.అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తూ వారి జీవితంతో సంబంధం ఉన్న ఐదు ముఖ్యమైన ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని అన్నారు. 2015 నుంచి నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం గా జాతీయస్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందని అంబేద్కర్ గారి సేవలను భావితరాలకు పరిచయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరాలనే అంత్యోదయ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిలు ఉప్పులేటి స్రవంతి,చిలుముల స్వామి, ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా కోకన్వీనర్ బుడిమే విజయ్, బిజెపి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఇప్ప స్వామి, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కల్లెపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
News Sources
- Punnami ReportingOwn reporting