Monday, 23 March 2026
  • Home  
  • రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలోఘనంగా గణపతి హోమం
- కాకినాడ

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలోఘనంగా గణపతి హోమం

కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం గణపతి హోమంను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు బున్నీ, కోటిపల్లి సతీష్, సంగాడి వీరబాబు పాల్గొన్నారు. పురోహితులు చావలి సాంబశివ తేజ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. కార్యాలయం ఇన్‌చార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, “రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంలో స్వామివారికి గణపతి హోమం వైభవంగా నిర్వహించాం. హోమానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నూరి బాబ్జి, జెడ్.ఆర్.యు.సి.సి సభ్యులు సిముత్యాల అనిల్, టిడిపి సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సంగాడి బంగారు రాజు బ్రదర్స్, బర్ల శ్రీనివాసు,అంకమ్మ రెడ్డి రామానాయుడు, ఐ.టిడిపి సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం గణపతి హోమంను ఘనంగా నిర్వహించారు.
కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు బున్నీ, కోటిపల్లి సతీష్, సంగాడి వీరబాబు పాల్గొన్నారు. పురోహితులు చావలి సాంబశివ తేజ శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. కార్యాలయం ఇన్‌చార్జ్ మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, “రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంలో స్వామివారికి గణపతి హోమం వైభవంగా నిర్వహించాం. హోమానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిన్నూరి బాబ్జి, జెడ్.ఆర్.యు.సి.సి సభ్యులు సిముత్యాల అనిల్, టిడిపి సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సంగాడి బంగారు రాజు బ్రదర్స్, బర్ల శ్రీనివాసు,అంకమ్మ రెడ్డి రామానాయుడు, ఐ.టిడిపి సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.