రాజోలు, అక్టోబర్ 10 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ఎస్సీ బోయ్స్ హాస్టల్‌లో మౌలిక వసతుల లోపాలపై వరుస ఫిర్యాదులకు స్పందించిన రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ శుక్రవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. ఎంపిడివో కుసుమ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు నల్లి మనోహరం, వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, సర్పంచ్ రేవు జ్యోతి, దళిత చైతన్య వేదిక నాయకులతో కలిసి హాస్టల్ పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు త్రాగునీరు, శానిటేషన్ వసతులు సక్రమంగా లేవని గుర్తించిన తాసీల్ధార్, మెరుగైన వసతులతో ఉన్న అద్దె భవనానికి హాస్టల్‌ను తక్షణం మార్చాలని సాంఘిక సంక్షేమ అధికారి ఎస్. సత్యనారాయణకు సూచించారు. పాడైపోయిన స్ట్రీట్ లైట్ మరమ్మతు చేయించి, వార్డెన్ల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి రెహమాన్, దళిత చైతన్య వేదిక నాయకులు పాల్గొన్నారు.

రాజోలు ఎస్సీ బోయ్స్ హాస్టల్‌లో మౌలిక వసతులపై తాసీల్ధార్ భాస్కర్ ఆకస్మిక పరిశీలన