*
*ఉచితంగా ఔషధాలు పంపిణీ చేసిన బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*
*హైదరాబాద్:* భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లీ ఫార్మా సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు వృద్ధులకు ఉచితంగా అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ.. “చంటి పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ పథకాలను అందించిన గొప్పనేత శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఆర్థిక సంస్కరణలు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. మోదీ జీవితం మనందరికీ ఆదర్శం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం భరతమాతకే గర్వకారణం. మోదీ గారి ముందుచూపు వల్లే ఆపరేషన్ సింధూరం వంటి సైనిక యుద్ధాల్లో ఘన విజయాన్ని సాధించగలిగాము. అదే ముందుచూపుతో కరోనా సమయంలో ప్రపంచానికి భారతదేశమే ఔషధాలను సరఫరా చేసింది” అని అన్నారు. ఆయన పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా, ప్రజా సేవకు అంకితం చేస్తున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కు శ్రీకారం చుట్టారని.. అంతటి గొప్పనేత మనకు ప్రధానిగా ఉండటం మన అదృష్టం అన్నారు ఏలూరి.. కాగా ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులతోపాటుగా ఐస్‌క్రీం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


