Tuesday, 24 March 2026
  • Home  
  • రాజమండ్రిలో మొదలైన ఓజీ తుఫాన్, ఓ జి బ్లాక్ బస్టర్ అంటున్న సత్యనారాయణ (అనుశ్రీ)
- తూర్పు గోదావరి

రాజమండ్రిలో మొదలైన ఓజీ తుఫాన్, ఓ జి బ్లాక్ బస్టర్ అంటున్న సత్యనారాయణ (అనుశ్రీ)

రాజమండ్రిలో మొదలైన “ఓజీ”‘ హీట్ చిత్రాన్ని వీక్షించేందుకు తరలి వచ్చిన ప్రముఖులు రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సందడి రాజమండ్రిలో మొదలైంది. రాత్రి 9 గంటలకే అభిమానులు థియేటర్ల వద్ద కిక్కిరిసిపోయారు. తమ అభిమాన నటుడి చిత్రం విజయవంతం కావాలని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. నుదుటిపై ‘ఓజీ’ పేరు ఉన్న రిబ్బన్లు కట్టుకుని ‘పవర్ స్టార్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందడితో అనుశ్రీ థియేటర్ పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను వీక్షించడానికి ప్రముఖులు థియేటర్లకు తరలివచ్చారు. రాజమండ్రిలోని అనుశ్రీ థియేటర్ కు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్తిబాబు. జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ స్టేట్ డైరెక్టర్స్ గంట స్వరూప, ప్రియా సౌజన్య , జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు చల్ల లక్ష్మీ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు , టిడిపి నగర నాయకులు ,జనసేన నాయకులు,వీరమహిళలు భారీగా వచ్చారు. అభిమానుల సమక్షంలో సినిమా చూసేందుకు వారు రావడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరిగింది. అభిమానులకు ఆరాధ్య దైవమైన‌ పవన్ కల్యాణ్ “OG” చిత్రం తూర్పుగోదావరి జిల్లాలోని 144 ధియేటర్లలో రేపు హౌస్ ఫుల్ అయిపోయాయని జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు.వరల్డ్ వైడ్ అన్ని ధియేటర్లు ఫుల్ అయ్యాయన్నారు.చిత్రం నభూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉండబోతుందని బుధవారం రాత్రి మీడియా కు చెప్పారు. మూడేళ్ళ నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూ స్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు,జనసేన నాయకులు,జన సైనికులు, పాల్గొన్నారు. కూటమి నాయకులు టిడిపి నాయకులు బిజెపి నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనుశ్రీ ధియేటర్ వద్ద అభిమానుల‌ సందడి, తీన్మార్ మోత,బాణాసంచా వెలుగులు అభిమానులు పాలాభిషేకాలు అనంతరం కేక్ కటింగ్ చేశారు.

రాజమండ్రిలో మొదలైన “ఓజీ”‘ హీట్

చిత్రాన్ని వీక్షించేందుకు తరలి వచ్చిన ప్రముఖులు

రాజమహేంద్రవరం:

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సందడి రాజమండ్రిలో మొదలైంది. రాత్రి 9 గంటలకే అభిమానులు థియేటర్ల వద్ద కిక్కిరిసిపోయారు. తమ అభిమాన నటుడి చిత్రం విజయవంతం కావాలని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. నుదుటిపై ‘ఓజీ’ పేరు ఉన్న రిబ్బన్లు కట్టుకుని ‘పవర్ స్టార్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందడితో అనుశ్రీ థియేటర్ పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను వీక్షించడానికి ప్రముఖులు థియేటర్లకు తరలివచ్చారు. రాజమండ్రిలోని అనుశ్రీ థియేటర్ కు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్తిబాబు. జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ స్టేట్ డైరెక్టర్స్ గంట స్వరూప, ప్రియా సౌజన్య , జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు చల్ల లక్ష్మీ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు , టిడిపి నగర నాయకులు ,జనసేన నాయకులు,వీరమహిళలు భారీగా వచ్చారు. అభిమానుల సమక్షంలో సినిమా చూసేందుకు వారు రావడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరిగింది.
అభిమానులకు ఆరాధ్య దైవమైన‌ పవన్ కల్యాణ్ “OG” చిత్రం తూర్పుగోదావరి జిల్లాలోని 144 ధియేటర్లలో రేపు హౌస్ ఫుల్ అయిపోయాయని జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు.వరల్డ్ వైడ్ అన్ని ధియేటర్లు ఫుల్ అయ్యాయన్నారు.చిత్రం నభూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉండబోతుందని బుధవారం రాత్రి మీడియా కు చెప్పారు. మూడేళ్ళ నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూ స్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు,జనసేన నాయకులు,జన సైనికులు, పాల్గొన్నారు. కూటమి నాయకులు టిడిపి నాయకులు బిజెపి నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనుశ్రీ ధియేటర్ వద్ద అభిమానుల‌ సందడి, తీన్మార్ మోత,బాణాసంచా వెలుగులు అభిమానులు పాలాభిషేకాలు అనంతరం కేక్ కటింగ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.