కొందరు రాజకీయ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతారు. అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు..ఇలా ఒకటేమిటి..సమస్థ అవలక్షణాలు వాళ్లలోనే ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు తామేదో చక్రవర్తులమన్నట్లు, ప్రజలంతా తమ బానిసలు అన్నట్లు ప్రవర్తిస్తారు. తాము దోచుకోవడానికి, ప్రజలపై పెత్తనం చేయడానికే పుట్టినట్లు భావిస్తారు. ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్ము దోచేసి..లక్షల కోట్లు సంపాదిస్తారు. అయితే..ఇదంతా ప్రజల్లో చైతన్యం రాకముందే. ప్రజల్లో ఒకసారి చైతన్యం వచ్చిందంటే..ఇటువంటి వారి ఆటలు సాగవు. ఇప్పుడు అచ్చం అలాగే జరుగుతోంది మాజీ మంత్రి ‘విడుదల రజని’ విషయంలో. వైకాపా’ హయంలో మంత్రిగా పనిచేసి ఈమె అప్పట్లో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె తరువాత మంత్రి అయ్యారు. అయితే..మంత్రి అయిన తరువాత..ఆమె, ఆమె అనుచరుల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. చిలకలూరిపేట తన సామ్రాజ్యం అయినట్లు..ఇక్కటి ప్రజలు తన బానిసలన్నట్లు వ్యవహరించి..వారిని అష్టకష్టాలకు గురిచేసింది. ఇష్టారాజ్యంగా వసూళ్లు సాగించింది. తనకు ఇష్టం లేనివారిపై పోలీసులను ప్రయోగించి కేసులు పెట్టించింది. తనకు ఎదురుతిరిగిన వారికి శ్రీకృష్ణజన్మస్థానాన్ని చూపించింది. అయితే రోజులన్నీ ఒకే విధంగా ఉండవు కదా…! సార్వ్రత్రిక ఎన్నికల్లో ఓటమితో ఆమెకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన అవినీతి, అరాచకాలు, అనైతికపనులపై కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఆమె అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో..ఇప్పుడు ఆమెపై ఏసీబీ కేసు నమోదు అయింది. చిలకలూరిపేటకు చెందిన వ్యాపారి బెదిరించి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనంపై ఆమెపై పక్కా ఆధారాలతో కేసు నమోదు అయింది. తనపై కేసు నమోదు కావడంతో..ఈ మాజీమంత్రి ఇప్పుడు చిందులు తొక్కుతున్నారు. తాను బీసీ మహిళను కనుకే తనపై కేసులు పెట్టారని, నర్సరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ‘పుల్లారావు’లు కలిసి తనపై కేసు పెట్టించి వేధిస్తున్నారని, ఒక బీసీ మహిళను ఈ విధంగా వేధిస్తారా..అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమె కులాల గురించి మాట్లాడలేదు. ఒక్కసారి అధికారంపోయి..తమ అవినీతి, అరాచకాలు బయటకు వస్తున్న తరుణంలో ఆమె తన కులం గురించి, తాను మహిళ అనే సంగతి గుర్తొచ్చింది. అవినీతి, అరాచకాలు చేసేటప్పుడు గుర్తుకు రాని ఆమె కులం..ఇప్పుడు కేసు నమోదు కావడంతోనే గుర్తుకు వచ్చిందా..? ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకుని..ఆమె కేసుల నుంచి తప్పించుకుంటుందా..? కులం ఆమెను కాపాడుతుందా..? ఏమో… మొత్తానికి…టిడిపికి చెందిన ఈ మొక్క..అక్కడ సీటు రాకపోవడంతో..వెంటనే వైకాపా’లోకి దూకి ఎమ్మెల్యే సీటు సంపాదించి…అనంతరం ‘జగన్’ను మెప్పించి మంత్రి అయ్యారు. చిన్నవయస్సులోనే రాజకీయాలను బాగా వంటపట్టించుకున్న ఈమెకు..ఇప్పుడు ఆమె చేసిన అవినీతి, అక్రమాలతో చిక్కుల్లో చిక్కుకున్నారు. అయితే..ఈ చిక్కులను తప్పించుకోవడానికి ఆమె కులాన్ని అడ్డుపెట్టుకుని బయటపడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం..ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయోమో…?