Friday, 10 April 2026
  • Home  
  • రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి
- తూర్పు గోదావరి

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి

నగరంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 30వ డివిజన్‌లోని బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు. పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ఐదేళ్లలో ఈ మూడు ముఖ్యమైన వీధుల్లో నివసిస్తున్న ప్రజలకు వైకాపా వారు కనీస సౌకర్యాలు కూడా అందించలేదని విమర్శించారు. రాజకీయ పరమైన కారణాలతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని గుర్తు చేశారు. “తమకు ఓటు వేసినవారికే కాదు, ఓటు వేయని వారికీ కూడా సమానంగా అభివృద్ధి చేయడం తమ బాధ్యతన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత ప్రజల సేవే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా 510 మీటర్ల సీసీ రోడ్లు, 1020 మీటర్ల డ్రైనేజీలు నిర్మించనున్నారని… పనులను ఒక నెలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు. చర్చిపేట, మేదర్పేట వంటి ప్రాంతాల్లో కూడా గతంలో నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇంకా మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల మధ్యే ఉంటాం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకుంటూ అందరికీ సేవ చేస్తాం” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం పలువురున్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, కర్రి కాశీ, స్థానిక నాయకులు దొండపాటి కృష్టఫర్, ముసిలి రామకృష్ణ, ఎరకా కొండబాబు, బుడంపర్తి నాగేశ్వరరావు, పట్నాల సుబ్బారావు, కాంట్రాక్టర్ చౌదరి, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 30వ డివిజన్‌లోని బెస్తా వీధి, గొల్ల వీధి, రజక వీధిలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు.

పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ఐదేళ్లలో ఈ మూడు ముఖ్యమైన వీధుల్లో నివసిస్తున్న ప్రజలకు వైకాపా వారు కనీస సౌకర్యాలు కూడా అందించలేదని విమర్శించారు. రాజకీయ పరమైన కారణాలతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని గుర్తు చేశారు. “తమకు ఓటు వేసినవారికే కాదు, ఓటు వేయని వారికీ కూడా సమానంగా అభివృద్ధి చేయడం తమ బాధ్యతన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత ప్రజల సేవే ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా 510 మీటర్ల సీసీ రోడ్లు, 1020 మీటర్ల డ్రైనేజీలు నిర్మించనున్నారని… పనులను ఒక నెలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల సందర్భంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు. చర్చిపేట, మేదర్పేట వంటి ప్రాంతాల్లో కూడా గతంలో నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇంకా మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల మధ్యే ఉంటాం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకుంటూ అందరికీ సేవ చేస్తాం” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం పలువురున్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, కర్రి కాశీ, స్థానిక నాయకులు దొండపాటి కృష్టఫర్, ముసిలి రామకృష్ణ, ఎరకా కొండబాబు, బుడంపర్తి నాగేశ్వరరావు, పట్నాల సుబ్బారావు, కాంట్రాక్టర్ చౌదరి, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.