ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి
రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా మేడ విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల దుస్థితి, నీటి పారుదల వ్యవస్థల లోపం, విద్యుత్ సదుపాయాల సమస్యలు,అలాగే యువతకు ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలను వివరించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులను కోరారు.
రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ అంశాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్
నియోజకవర్గ ప్రజల సమస్యలను సీరియస్‌గా పరిగణించి,సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.మేడ విజయ శేఖర్ రెడ్డి ఈ సమావేశం రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.

రాజంపేట నియోజకవర్గ సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన మేడ విజయ శేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ను మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా మేడ విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల దుస్థితి, నీటి పారుదల వ్యవస్థల లోపం, విద్యుత్ సదుపాయాల సమస్యలు,అలాగే యువతకు ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలను వివరించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులను కోరారు. రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ అంశాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల సమస్యలను సీరియస్‌గా పరిగణించి,సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.మేడ విజయ శేఖర్ రెడ్డి ఈ సమావేశం రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు.

