– ఘనంగా సన్మానించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
సిద్దవటం ఆగస్టు 22
అన్నమయ్య జిల్లా టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జిగా నియమింపబడ్డ నేపథ్యంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం జగన్మోహన్ రాజుకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రాజు అధ్యక్షులుగా పనిచేసిన సమయంలో టిడిపి అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారన్నారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రామయ్య కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.


