అన్నమయ్య జిల్లాకు రాజంపేటనే సహజమైన జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గళమెత్తుతున్న ప్రజా డిమాండ్ మరింత వేగం అందుకుంది. రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష శిబిరం ఈరోజు రాజంపేట పాతబస్టాండు సర్కిల్ వద్ద ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు, సంఘ ప్రతినిధులు అక్కడికి తరలివచ్చి, ఉద్యమానికి తమ మద్దతును తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు హాజరై, నిరాహారదీక్ష శిబిరానికి పూర్తి మద్దతు ప్రకటించారు. తన ప్రసంగంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించడం మా ప్రజల హక్కు. ఈ ప్రాంతం ప్రజల శ్రేయస్సు, భవిష్యత్తు దృష్ట్యా రాజంపేటనే కేంద్రంగా చేయాలని ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
ఈ నిరాహారదీక్షకు రాజకీయ పార్టీ పరంగా భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు ఐక్యంగా హాజరయ్యారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు అలాగే వివిధ ప్రజా సంఘాలు, విద్యాసంస్థల యజమానులు, వ్యాపారవేత్తలు, యువత, మహిళలతో పాటు ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముఖ్యంగా,ప్రభుత్వమే ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ
జిల్లా కేంద్రం రాజంపేటే కావాలి కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి.అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ప్రజలు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని,తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజంపేట భౌగోళికంగా, పరిపాలనా పరంగా సహజ జిల్లా కేంద్రమని.ఎన్నో ప్రభుత్వ శాఖలు, సౌకర్యాలు ఇప్పటికే రాజంపేటలోనే ఉన్నాయని
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేశారు.
ఉద్యమం మరింత వేగం
రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులను సందర్శించడం, బహిరంగ సభలు నిర్వహించడం, ఉద్యమాన్ని జిల్లాలో గ్రామాగ్రామానికి విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నివేదించారు.
అన్నమయ్య జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ రిలే నిరాహారదీక్ష మొదటి అడుగై నిలిచింది.
మా జిల్లా కేంద్రం మా హక్కు అన్న నినాదాలతో రాజంపేటలో ప్రజాస్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది.

రాజంపేట జిల్లా కేంద్ర సాధన కోసం అన్ని పార్టీల ఏకతాటిపై రిలే నిరాహారదీక్షకు శుభారంభం.నిరాహారదీక్ష శిబిరానికి పూర్తి మద్దతు అందించిన యల్లటూరు శ్రీనివాస రాజు
అన్నమయ్య జిల్లాకు రాజంపేటనే సహజమైన జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గళమెత్తుతున్న ప్రజా డిమాండ్ మరింత వేగం అందుకుంది. రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష శిబిరం ఈరోజు రాజంపేట పాతబస్టాండు సర్కిల్ వద్ద ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు, సంఘ ప్రతినిధులు అక్కడికి తరలివచ్చి, ఉద్యమానికి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు హాజరై, నిరాహారదీక్ష శిబిరానికి పూర్తి మద్దతు ప్రకటించారు. తన ప్రసంగంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించడం మా ప్రజల హక్కు. ఈ ప్రాంతం ప్రజల శ్రేయస్సు, భవిష్యత్తు దృష్ట్యా రాజంపేటనే కేంద్రంగా చేయాలని ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ నిరాహారదీక్షకు రాజకీయ పార్టీ పరంగా భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు ఐక్యంగా హాజరయ్యారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు అలాగే వివిధ ప్రజా సంఘాలు, విద్యాసంస్థల యజమానులు, వ్యాపారవేత్తలు, యువత, మహిళలతో పాటు ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా,ప్రభుత్వమే ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ జిల్లా కేంద్రం రాజంపేటే కావాలి కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి.అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ప్రజలు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని,తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజంపేట భౌగోళికంగా, పరిపాలనా పరంగా సహజ జిల్లా కేంద్రమని.ఎన్నో ప్రభుత్వ శాఖలు, సౌకర్యాలు ఇప్పటికే రాజంపేటలోనే ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం మరింత వేగం రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులను సందర్శించడం, బహిరంగ సభలు నిర్వహించడం, ఉద్యమాన్ని జిల్లాలో గ్రామాగ్రామానికి విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నివేదించారు. అన్నమయ్య జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ రిలే నిరాహారదీక్ష మొదటి అడుగై నిలిచింది. మా జిల్లా కేంద్రం మా హక్కు అన్న నినాదాలతో రాజంపేటలో ప్రజాస్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది.

