రాజంపేట జిల్లా కేంద్రం సాధన ఉద్యమానికి మరింత బలంగా తోడ్పాటు లభించింది. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజును కలిసి అభినందనలు తెలుపుతూ, రాజంపేట జిల్లా కేంద్రం సాధనకు మద్దతు ఇవ్వమని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా జెఎసి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాను ముందుంటానని జగన్ మోహన్ రాజు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, కార్యదర్శి సుభాష్, కోశాధికారి రవీంద్ర నాయుడు తదితరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా కేంద్రం సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో ప్రత్యేక విస్తృత సమావేశం జరగనుందని, ప్రభుత్వం దృష్టికి వినతిపత్రాలు పంపుతామని ప్రభాకర్ నాయుడు తెలిపారు.

రాజంపేట జిల్లా కేంద్రం సాధనకు మద్దతు ప్రకటించిన జగన్ మోహన్ రాజు