-రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి భేటీ – ప్రజల మనోభావాలను వివరించిన నాయకులు
చిట్వేల్, డిసెంబర్ 2: పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటగా మార్చాలనే స్థానిక ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.
అమరావతిలో ముఖ్యమంత్రి కలిసిన ఈ ఇద్దరు కీలక నాయకులు, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరాన్ని, అందుకు గల అన్ని మౌలిక వసతులను వివరించారు. ఈ ప్రాంత ప్రజల బలమైన మనోభావాలను అలాగే రాజంపేట అనుకూలతలను సీఎం తెలియజేశారు.
రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే కలిగే పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక అనుకూలతలు, అన్ని వర్గాల ప్రజల సులభతర రవాణా వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నాయకులు ముఖ్యమంత్రిని కోరారు.


