అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు కొనసాగుతున్న “రిలే నిరాహారదీక్ష”లో పాల్గొన్న నిరాహార దీక్షకులకు మద్దతుగా రాజంపేట జనసేన పార్టీ నాయకులు మరియు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు ఈ రోజు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
దీక్షా శిబిరంలో మాట్లాడిన శివరామరాజు
అన్నమయ్య జిల్లా ఏర్పాటైన మొదటి రోజు నుంచే రాజంపేట ప్రజల హృదయాల్లో ఒకే మాట ‘రాజంపేటనే జిల్లా కేంద్రం కావాలి’. ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదు, ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష,” అని పేర్కొన్నారు.
జిల్లా కేంద్రం రాజంపేటకే రావాలని సమగ్ర అభివృద్ధి దృష్ట్యా అనివార్యమని స్పష్టం చేస్తూ,
“ప్రజల న్యాయమైన హక్కు కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో జనసేన ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుంది,” అని ధైర్యం నింపారు.
ఆయన వెంట మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నీటి సంఘం అధ్యక్షుడు నారదాసు రామచంద్ర, విశ్రాంత పోలీసు అధికారి పూల లక్ష్మీ నరసయ్య, గూడూరు శ్రీనివాసరాజు, మౌలా, చింతల శివ మరియు అనేక మంది స్థానిక జనసేన నాయకులు పాల్గొని దీక్షకులకు మద్దతుగా నిలిచారు. స్థానిక నాయకుల రాకతో దీక్షా శిబిరంలో ఉత్సాహం మరింత పెరిగింది.
అదేక్రమంలో, రాజంపేట – కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాలు, కాగితాలు, ర్యాలీలు, నిరాహారదీక్షలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు కీలక ప్రకటన చేశారు.
“జిల్లా హక్కు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన అండగా ఉంటుంది. ప్రజల ఆశయాన్ని సాధించటం కోసం అన్ని విధాలా సహకరిస్తాం,” అని ఆయన పేర్కొన్నారు.
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రజా ఉద్యమానికి జనసేన నాయకుల మద్దతు లభించడం, దీక్షకులలో మరియు సాధన సమితిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్ సాధనకు పోరాటం మరింత వేగం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది.


