రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని దీక్ష లోపాల్గొన్న పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రాజంపేట పట్టణాన్ని రాజంపేట జిల్లా కేంద్రంగా చేయకుండా రాళ్ళల్లో, కొండల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్ పాలనసాగించి, సునకానందం పొందడమే కాకుండా,రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి,యం.పి పాపాల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేటకు పట్టణానికి తీరని ద్రోహం చేసి రాజంపేట ప్రజలను విసిగించారని ఇప్పుడు దీనిమీద మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి రాజంపేట ప్రజల మనోభావాలను దెబ్బ తినకుండా రాజంపేటను వెంటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు కోరారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు,మేడికొండు రవికుమార్ నాయుడు, మాజీ అధ్యక్షులు బాపనయ్య నాయుడు, ప్రముఖ డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి,కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, చెరువు ప్రెసిడెంట్ నాగినేని నాగేశ్వరరావు, సింగల్ విండో ప్రెసిడెంట్ మణి నాయుడు,దివాకర్ నాయుడు, తులసి నాగేంద్ర, రాముయాదవ్,గండికోట రామకృష్ణయ్య, కొల్లపనేని వెంకటేశ్వర్లు నాయుడు మరియుఎన్.డి. ఏ కూటమి నాయకులు రాజంపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


