రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
జేఏసీ సభ్యుల రౌండ్ టేబుల్ సమావేశం
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశంముఖ్యఅతిథిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్
రైల్వే కోడూరు పట్టణంలోని సిద్దేశ్వర కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని రాజంపేట రైల్వే కోడూరు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ , రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో విచ్చేసిన శాసన సభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని అంతేకాకుండా అన్ని వనరులు సమతుల్యంగా ఉన్నటువంటి కేంద్రం రాజంపేట అని ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రాజంపేట, రైల్వే కోడూరు ప్రజల యొక్క మనోభావాలను వారికి తెలియపరచి న్యాయం జరిగే విధంగా చూస్తానని ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ తెలియజేశారు,, రాష్ట్రంలోని రెండవ ఆదాయ కేంద్రంగా ఉన్న మంగంపేట ఏపీఎండిసి మన నియోజకవర్గంలో ఉండడం మనకు కలిసి వచ్చే అంశమని తాను ఒక ఎమ్మెల్యే గానే కాకుండా సామాన్య ప్రజలలో ఒకరిగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విన్నవిస్తానని సమావేశంలో అరవ శ్రీధర్ తెలియజేశారు,
అనంతరం జేఏసీ సభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కి వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియపరిచారు.ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నార్జాల హేమరాజ్ ,పోతురాజు నవీన్, చంద్ర, డాక్టర్ సయ్యద్ భాష, ముత్యాల కిషోర్, అమర, హేమంత్, విక్టరీ స్కూల్ నరసింహారెడ్డి, సిల్వర్ బెల్స్ కుమార్, కూటమి నాయుకులు మొదలగు వారు పాల్కొన్నారు.


