Friday, 27 March 2026
  • Home  
  • “రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించండి… ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు”
- అన్నమయ్య

“రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించండి… ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు”

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోరాటంలో భాగంగా 3వ రోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజలు, నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మరియు జేఏసీ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతు ప్రకటించారు. అదే సందర్భంగా, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు, రాజంపేట మరియు కోడూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో జరగనున్న నిరసన కార్యక్రమాలు, నిరాహారదీక్షలకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. ప్రజల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు నిర్వహించిన నిరాహారదీక్షలో డాక్టర్ విశ్వనాథ్, డి.ఎస్. రావు, హరీష్, కె. చంగలరాయుడు, ఎం. నరసింహ, ఎం. మహేష్, హరీష్, ఎం. సుబ్బరాయుడు, డి. కళాధర్, ఎస్. సిద్ధిక్, సిసింద్రీ, ఎస్. మన్సూర్, మనోజ్, బి. నాగేంద్ర, కె. సుధాకర్, బాలకృష్ణ, పరుశురాం, పి. శివాజీ, పి. చెంగయ్య, ఎం. శ్రీహరి, టి. ప్రశాంత్, ఆర్. సురేంద్ర, ఆర్. సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరాహారదీక్షలు మరింత ఉధృతం కానున్నాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న పోరాటంలో భాగంగా 3వ రోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. స్థానిక ప్రజలు, నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మరియు జేఏసీ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతు ప్రకటించారు.

అదే సందర్భంగా, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు, రాజంపేట మరియు కోడూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లో జరగనున్న నిరసన కార్యక్రమాలు, నిరాహారదీక్షలకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. ప్రజల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈరోజు నిర్వహించిన నిరాహారదీక్షలో
డాక్టర్ విశ్వనాథ్, డి.ఎస్. రావు, హరీష్, కె. చంగలరాయుడు, ఎం. నరసింహ, ఎం. మహేష్, హరీష్, ఎం. సుబ్బరాయుడు, డి. కళాధర్, ఎస్. సిద్ధిక్, సిసింద్రీ, ఎస్. మన్సూర్, మనోజ్, బి. నాగేంద్ర, కె. సుధాకర్, బాలకృష్ణ, పరుశురాం, పి. శివాజీ, పి. చెంగయ్య, ఎం. శ్రీహరి, టి. ప్రశాంత్, ఆర్. సురేంద్ర, ఆర్. సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరాహారదీక్షలు మరింత ఉధృతం కానున్నాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.