పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోగల పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో భీమవరం టాకీస్ 118 వ చిత్రంగా మహా నాగ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది బుధవారం సినిమా షూటింగ్ ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ను ఘనంగా ప్రారంభించారు
యాంత్రిక ప్రపంచంలో దైవస్మరణ మరిచి దైనందిన జీవితంలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహానాగ సినిమా ద్వారా దైవ భక్తిని మరోసారి చాటనున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
రాచర్ల గ్రామంలో శ్రీ కృష్ణాశ్రమం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో మహానాగ సినిమా షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా భగవంతుని ప్రజలందరూ కొలిచే విధంగా మహానాగ సినిమా ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎమ్మెల్యే బొలిశెట్టి కి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద తమిళ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని మన తెలుగు సినిమాలు సరిగా లేవని స్వామి దయతో మహా నాగ సినిమాను 18 రోజులపాటు రాచర్ల గ్రామంలో పచ్చటి వాతావరణంతో పల్లెటూరి నేపథ్యంలో సినిమా షూటింగ్ చేస్తున్నామని అన్నారు ఆగస్టు 15వ తేదీ 15 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టమని ఇది గిన్నిస్ రికార్డు వైపు వెళుతుందని అందులో ఒకటిగా మహానాగ సినిమా ఉందని అన్నారు గతంలో వాసవి మహత్యం సినిమా తీసిన డైరెక్టర్ ఉదయ భాస్కర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నారని స్క్రిప్ట్ అంబికా కృష్ణ అందించారని నటీనటులు హీరోగా రమాకాంత్ హీరోయిన్ గా శ్రావణి ఉన్నారని సీనియర్ నటులు సుమన్ తోపాటు జబర్దస్త్ అప్పారావు ఇంకా 20 మంది నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ నిర్మాత అంబికా కృష్ణ పాలూరి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు రాచర్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రాచర్లలో మహానాగ సినిమా షూటింగ్ ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోగల పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో భీమవరం టాకీస్ 118 వ చిత్రంగా మహా నాగ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారు అయ్యింది బుధవారం సినిమా షూటింగ్ ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్లాప్ కొట్టి షూటింగ్ ను ఘనంగా ప్రారంభించారు యాంత్రిక ప్రపంచంలో దైవస్మరణ మరిచి దైనందిన జీవితంలో పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మహానాగ సినిమా ద్వారా దైవ భక్తిని మరోసారి చాటనున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాచర్ల గ్రామంలో శ్రీ కృష్ణాశ్రమం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో మహానాగ సినిమా షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా భగవంతుని ప్రజలందరూ కొలిచే విధంగా మహానాగ సినిమా ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎమ్మెల్యే బొలిశెట్టి కి కృతజ్ఞతలు తెలియజేశారు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద తమిళ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని మన తెలుగు సినిమాలు సరిగా లేవని స్వామి దయతో మహా నాగ సినిమాను 18 రోజులపాటు రాచర్ల గ్రామంలో పచ్చటి వాతావరణంతో పల్లెటూరి నేపథ్యంలో సినిమా షూటింగ్ చేస్తున్నామని అన్నారు ఆగస్టు 15వ తేదీ 15 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టమని ఇది గిన్నిస్ రికార్డు వైపు వెళుతుందని అందులో ఒకటిగా మహానాగ సినిమా ఉందని అన్నారు గతంలో వాసవి మహత్యం సినిమా తీసిన డైరెక్టర్ ఉదయ భాస్కర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేస్తున్నారని స్క్రిప్ట్ అంబికా కృష్ణ అందించారని నటీనటులు హీరోగా రమాకాంత్ హీరోయిన్ గా శ్రావణి ఉన్నారని సీనియర్ నటులు సుమన్ తోపాటు జబర్దస్త్ అప్పారావు ఇంకా 20 మంది నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు సినీ నిర్మాత అంబికా కృష్ణ పాలూరి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు రాచర్ల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

