*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వారి సౌజన్యంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*
పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వారి సౌజన్యంతో రాంపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆరు లక్షల రూపాయలతో వంటగది స్టోర్ రూమ్ వితరణ..
రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ సౌజన్యంతో రాంపురం గవర్నమెంట్ హైస్కూల్లో ఆరు లక్షల రూపాయలు వంటగది స్టోర్ నిర్మించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని నూతనంగా నిర్మించిన వంటగది స్టోర్ రూమ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ రొటరీ క్లబ్ కపుల్స్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు రాంప్రసాద్ శోభన్ మాట్లాడుతూ కొన్నాళ్ల క్రితం భీమునిపట్నంలో సాగునీటి పథకాన్ని కేజీహెచ్ లో మందులు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు అనంతరం స్కూల్ విద్యార్థులకు ఆట వస్తువులు విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగినది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, కె. రాము గారు, సీనియర్ నాయకులు జామి గంగు నాయుడు గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం గారు,ఎంపీటీసీ గండి హిమబిందు గారు,నాగభూషణం గారు, బిజెపి కన్వీనర్ గొర్ల రామానాయుడు గారు, మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణ రావు గారు ,జనసేన మండల ప్రెసిడెంట్ కొరుపోలు రామనాయుడు గారు, ఏం సి డైరెక్టర్ ఆర్.ఎస్. నాయుడు గారు, ముమ్మన సతీష్ గారు, సీనియర్ నాయకులు బయలుపూడి హరగోపాల్ గారు, నీటి పల్లి మహేష్ గారు, గొర్లి అప్పారావు గారు, దాడి భోగలింగం గారు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


