రహదారి విస్తరణకు శ్రీకారం – రైల్వే కోడూరు అభివృద్ధికి కూటమి శ్రీకారం
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
కడప-తిరుపతి రహదారి విస్తరణ, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.100 కోట్ల నిధుల నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుత్తనవారిపల్లె ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో రహదారి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృషిఫలితంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగిందని నాయకులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక కోడూరు–రాజంపేట-తిరుపతి మద్య ప్రయాణం వేగవంతమై, పరిశ్రమలు-వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో నితిన్ గడ్కరీ, పురందేశ్వరి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి ప్రజాపక్ష అభివృద్ధి సంకల్పానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు రవాణా భద్రత, ఆర్థికాభివృద్ధి, పర్యాటక విస్తరణ- ఇవన్నీ ఈ రహదారి దశల వారీగా పూర్తికావడంతో సాధ్యమవుతాయని నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, జనసేన నాయకులు మౌలా, చింతల శివ, శంకర్ రాజు, గోవర్ధన్తో పాటు స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

