రహదారి నిర్మాణానికి భూమి పూజ
పున్నమి ప్రతినిధి అంబాజీపేట
అంబాజీపేట మండలం మాచవరం పరిధిలో వున్న శ్రీనివాసనగర్ విజయభేతాళ స్వామి ఆలయం వద్ద నుండి పోతాయిలంక ప్రధాన రహదారి వరకు సుమారు రూ. 1.10 కోట్ల mnregs నిధులు తో నిర్మించనున్న సిసి, బిటి రోడ్లకు నియోజకవర్గం శాససభ్యుడు గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమం లో మాచవరం గ్రామ సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు, రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటి చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, యంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు మైపాల తాతాజీ, కొర్లపాటి గోపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


