Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

రసూల్ మృతి పై కాకర్ల సురేష్ విచారం

Punnami Newsroom Published:

గానుగపెంటలో విషాదంలో.. జడ రసూల్ మృతదేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల..!
బాధిత కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్ విషాదకర ఘటనలో మృతి చెందగా ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మృతుడి స్వగృహానికి చేరుకొని జడ రసూల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు. కుటుంబం ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకుంటున్నామని, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, జడ రసూల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తాము వారి వెంట ఉంటామని స్పష్టం చేశారు.

రసూల్ మృతి పై కాకర్ల సురేష్ విచారం

రసూల్ మృతి పై కాకర్ల సురేష్ విచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *