Friday, 6 March 2026
  • Home  
  • రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా, భారత్‌కు తాత్కాలిక మినహాయింపు
- ఖమ్మం

రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా, భారత్‌కు తాత్కాలిక మినహాయింపు

: పున్నమి న్యూస్ (ప్రతినిధి ఖమ్మం) మార్చి6/2026 రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా, భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టంచేశారు. ఫలితంగా రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరదన్నారు. అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్‌ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడిచమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

: పున్నమి న్యూస్
(ప్రతినిధి ఖమ్మం)
మార్చి6/2026

రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా, భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టంచేశారు. ఫలితంగా రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరదన్నారు. అమెరికాకు భారత్‌ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్‌ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడిచమురు కొనుగోళ్లను భారత్‌ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.