Monday, 23 March 2026
  • Home  
  • రబీకి నంద్యాల జిల్లాలో యూరియా సమృద్ధి : జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు
- E-పేపర్

రబీకి నంద్యాల జిల్లాలో యూరియా సమృద్ధి : జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు

నంద్యాల జిల్లాలో రబీ 2025–26 సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సీజన్‌కు జిల్లాకు మొత్తం 68,777 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబరు 24 వరకు 30,059 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, ఇప్పటికే 36,914 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములలో సహా వివిధ కేంద్రాల్లో 13,865 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రాబోయే రోజుల్లో కూడా యూరియా సమస్య ఉండదని స్పష్టం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధర మేరకే చెల్లించి, రసీదు తప్పనిసరిగా పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నంద్యాల జిల్లాలో రబీ 2025–26 సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సీజన్‌కు జిల్లాకు మొత్తం 68,777 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 1 నుంచి డిసెంబరు 24 వరకు 30,059 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, ఇప్పటికే 36,914 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములలో సహా వివిధ కేంద్రాల్లో 13,865 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రాబోయే రోజుల్లో కూడా యూరియా సమస్య ఉండదని స్పష్టం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధర మేరకే చెల్లించి, రసీదు తప్పనిసరిగా పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.