నిర్మల్ జిల్లా డిసెంబర్ 11 (పున్నమి ప్రతినిధి) .
రత్నాపూర్ కాండ్లి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి గడ్డం హరీష్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ—
ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, అఖండ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హరీష్ హామీ ఇచ్చారు.
గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టపడి పని చేసే నాయకుడు కావాలని, ప్రతి వ్యక్తి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు ముందుంటానని తెలిపారు. సమాజ సేవకుడిగా గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, నీతి–నిజాయితీతో సేవలు అందిస్తానని హరీష్ స్పష్టం చేశారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం తన ప్రధాన లక్ష్యమని అభ్యర్థి పేర్కొన్నారు.


