చిట్వేలి,అక్టోబర్ 10: (వార్తలు ప్రతినిధి)
రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల పరిధిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంగా ఎంచుకున్న అలుపెరుగని యోధుడు దొండ్లవాగు వేణుగోపాల్ 105 సార్లకు పైగా రక్తదానం చేసి విశేష కీర్తిని సంపాదించారు.
రక్తదానం అవసరం, వ్యసనం, ఆదర్శం, ఆవశ్యం అనే భావనలతో తన జీవితాన్ని అర్పించిన ఆయన, ఈ క్రమంలో డాక్టరేట్‌ను అలంకారంగా పొందారు. అనేక మంది ప్రముఖుల అభినందనలు అందుకుంటూ, సేవా మార్గంలో ముందుకు సాగుతున్న వేణుగోపాల్ శుక్రవారం రెడ్‌క్రాస్ సొసైటీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.బాల్యమిత్రులు మరియు సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో తన సాహసయాత్రతో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.


