రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు కోటమిట్టలోని సాధిమంజిల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇప్తార్ విందు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
రంజాన్ మాసం ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ఇప్తార్ విందులో పాల్గొన్న నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సౌహార్దం, సామరస్యానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సంఘాల నాయకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


