రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన ప్రొఫెసర్ కోదండరాం
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
24 మార్చి 2026
ఫార్మా సిటీ మరియు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ బాధితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా భూ సేకరణలో నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన బలవంతపు భూ సేకరణ వల్ల నష్టపోయిన రైతులకు తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వివాదాల్లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.
అలాగే ఫార్మా సిటీ భూసేకరణ జరిగిన కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమై వారి గ్రామాల సమస్యలను తెలుసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు.
ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలో రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దారా సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కార్యదర్శులు సామ నిరంజన్, నాగని రామకృష్ణ మరియు బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.



