Tuesday, 9 December 2025
  • Home  
  • యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు
- నాగర్‌కర్నూల్

యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి యూరి అందించడంలో విఫలం చెందిందని దీని పట్ల రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు సోమవారం మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించాల్సిన యూరియాను కేటాయించకుండా తక్కువ మోదాలో యూరియా కేటాయించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రోజువారీగా సహకార కార్యాలయం ముందు బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అనేక ఆంక్షలు పెడుతూ రెండు ఎకరాల పైన ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని రెండెకరాలకు తక్కువగా ఉన్న రైతులకు యూరియా అందించడం లేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు యూరియా మరియు నానో లిక్విడ్ కు సబ్సిడీ ద్వారా 900 రూపాయలు అయితే బయట కేవలం ఒక బస్తా యూరియాకు 1500 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు ప్రభుత్వం యూరియా కొరత చూపించడంతో బ్లాక్ మార్కెట్లో విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయం చేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కొంపల్లి అశోక్ మండల నాయకులు చంద్రశేఖర్ పరశురాం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి యూరి అందించడంలో విఫలం చెందిందని దీని పట్ల రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు సోమవారం మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించాల్సిన యూరియాను కేటాయించకుండా తక్కువ మోదాలో యూరియా కేటాయించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రోజువారీగా సహకార కార్యాలయం ముందు బారులు తీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు అనేక ఆంక్షలు పెడుతూ రెండు ఎకరాల పైన ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని రెండెకరాలకు తక్కువగా ఉన్న రైతులకు యూరియా అందించడం లేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు యూరియా మరియు నానో లిక్విడ్ కు సబ్సిడీ ద్వారా 900 రూపాయలు అయితే బయట కేవలం ఒక బస్తా యూరియాకు 1500 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు ప్రభుత్వం యూరియా కొరత చూపించడంతో బ్లాక్ మార్కెట్లో విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితులలో వ్యవసాయం చేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కొంపల్లి అశోక్ మండల నాయకులు చంద్రశేఖర్ పరశురాం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.