
పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
ఉదయ శంకర్ యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమితులయినారు
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అధ్యాపకులు అయిన మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ శంకర్ గారిని మన జిల్లా అధికారి కలెక్టర్ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో యూత్ రెడ్ క్రాస్ కో కన్వీనర్ గా నియమించారు. అందుకు సంబందించిన ధ్రువపత్రం ఇండియన్ రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం అందుకున్నారు. రక్త దన శిబిరం, పేదలకు నిత్యావసరాలు అందించడం, విశ్వవిద్యాలయ ప్రాంగణం లో వేల మొక్కలు నాటడం, ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించడం, వలస కూలీలకు ఆహార పొట్లాలు అందించడం వంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు ఉదయ్ శంకర్ గారు చేసిన పనులలో మెచ్చుతునకలు, అలాగే తన అపారమైన విద్య ను విద్యార్థులకు అందిస్తూ మరియు జిల్లా ఎంత్రాంగానికి వివిధ సందర్భాల లో యెనలేని సహాయం అందించడం లో ముందుంటారని నిరూపించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు ఉదయ శంకర్ గారి కి ఈ పదవి ఒక అరుదయిన గౌరవమని ప్రశంసించారు. ఈ సందర్బంగా ఉపకులపతి ఉదయ శంకర్ ని అభినందిస్తూ ఇప్పటివరకు విశ్వవిద్యాలయానికి అందించిన సేవలు మన జిల్లా వాసులకు ఈ పదవి ద్యారా అందించాలని ఆకాంక్షించారు. ఉదయ శంకర్ గారు ఈ పదవి తనకి రావడం అనేది ఎంతో సంతోషానన్ని ఇచ్చింది అని, మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తనపై నమ్మకం తో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా వాసులకు ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అని చెప్పారు.

