జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, విమలభాను దంపతుల కుమారుడు, యువ నాయకుడు సామినేని ప్రశాంత్ బాబు జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలోని వారి స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఉదయభాను, విమలభాను దంపతులతో కలిసి నేతలు కట్ చేయించారు. అనంతరం ప్రశాంత్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అదే సందర్భంగా విమలభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేట ఆనంద సాయి ఆలయంలో ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను ప్రత్యేక పూజలు చేశారు. తరువాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు.

యువ నాయకుడు ప్రశాంత్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా
జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, విమలభాను దంపతుల కుమారుడు, యువ నాయకుడు సామినేని ప్రశాంత్ బాబు జన్మదిన వేడుకలు బుధవారం పట్టణంలోని వారి స్వగృహంలో జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఉదయభాను, విమలభాను దంపతులతో కలిసి నేతలు కట్ చేయించారు. అనంతరం ప్రశాంత్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంగా విమలభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేట ఆనంద సాయి ఆలయంలో ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమలభాను ప్రత్యేక పూజలు చేశారు. తరువాత నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు.

