Sunday, 22 March 2026
  • Home  
  • యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి
- ఎలూరు

యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి

యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి ఆగిరిపల్లి: మానసిక ఆరోగ్యాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని లక్ష్యంతో సాయి ప్రియ చేస్తున్న సేవను యువత, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. మండలంలోని కనసానపల్లికి చెందిన సైకాలజిస్ట్ పేట సాయి ప్రియ వేలాది మందికి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన మానసిక విశ్లేషణతో వారి జీవితంలో సానుకూల దృక్పథం తీసుకొచ్చినందుకుగాను హైదరాబాదులో నిర్వహించిన ఎక్స్ ఈల్లా ఉమెన్ కాన్ క్లేవ్-2025 కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డును మాజీ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కిరణ్ బేడీ మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పై ఐదువందలపైగా అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస్ సదస్సులు నిర్వహించి వేలాదిమందికి మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించి వారి జీవితాలకు సరైన మార్గం చూపించడం కోసం తన వృత్తిని వారికోసం అంకితం చేయటం మంచి పరిణామం అని కిరణ్ బేడీ అన్నారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సాయి ప్రియ మాట్లాడుతూ భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం పై అనేకమందికి నా వంతుగా సహాయ అందించడానికి శాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు. ఆమెకు అవార్డు లభించడం పట్ల కనసానపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి
ఆగిరిపల్లి:
మానసిక ఆరోగ్యాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని లక్ష్యంతో సాయి ప్రియ చేస్తున్న సేవను యువత, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. మండలంలోని కనసానపల్లికి చెందిన సైకాలజిస్ట్ పేట సాయి ప్రియ వేలాది మందికి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన మానసిక విశ్లేషణతో వారి జీవితంలో సానుకూల దృక్పథం తీసుకొచ్చినందుకుగాను హైదరాబాదులో నిర్వహించిన
ఎక్స్ ఈల్లా ఉమెన్ కాన్ క్లేవ్-2025 కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డును మాజీ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కిరణ్ బేడీ మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పై ఐదువందలపైగా అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస్ సదస్సులు నిర్వహించి వేలాదిమందికి మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించి వారి జీవితాలకు సరైన మార్గం చూపించడం కోసం తన వృత్తిని వారికోసం అంకితం చేయటం మంచి పరిణామం అని కిరణ్ బేడీ అన్నారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సాయి ప్రియ మాట్లాడుతూ భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం పై అనేకమందికి నా వంతుగా సహాయ అందించడానికి
శాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు. ఆమెకు అవార్డు లభించడం పట్ల కనసానపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.