బి .కొత్తకోట అక్టోబర్ 17 వార్తలు ప్రతినిధి ; నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే బావి జీవితం లో విజయం మీదేనని బి.కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాల్ రెడ్డి యువతకు సూచించారు. శుక్రవారం బి.కొత్తకోట సుంకు కాలేజీలో యువతనుద్దేశించి మాట్లాడుతూ యువత డ్రగ్స్ ముట్టుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఆ బలహీన క్షణాలను అధిగమించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నారు. సరదాకైనా డ్రగ్స్ జోలికి వెళ్లరాదని తాత్కాలిక సుఖం కోసం విలువైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దని హితవు పలికారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే వారించాలని సూచించారు. అదేవిధంగా యువత వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రత పాటించాలని, హెల్మెట్ లేని ప్రయాణం చేయరాదని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుంకు కాలేజ్ అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యువత మత్తు వదిలితే జీవితంలో విజయం మీదే