ఇల్లంతకుంట/పున్నమి ప్రతినిధి/ జనవరి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం క్రికెట్ టోర్నమెంట్ లొ గొల్లపల్లి జట్టు ఘన విజయం సాధించింది ఎన్నికల సందర్భంగా క్రీడాకారులు, యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు మరోసారి తన మాటకు కట్టుబాటును చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో తిప్పాపూర్ – గొల్లపల్లి జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో గొల్లపల్లి జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు, ఉపసర్పంచ్ ఓరుపుల లక్ష్మన్ గారు అభినందించారు. అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీసరగండ్ల అనిల్ కుమార్ గారు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ గారు, కేటీఆర్ సేన అధ్యక్షులు ఓరుపుల రాములు గారు, యువ నాయకులు పొట్ల అనిల్ గారు పాల్గొని క్రీడాకారులను ప్రశంసించారు.
గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు గ్రామాల్లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని నాయకులు తెలిపారు.

యువత కోసం ఇచ్చిన మాటను క్రీడలతో నిలబెట్టిన సర్పంచ్ రడం లక్ష్మీ ప్రవీణ్
ఇల్లంతకుంట/పున్నమి ప్రతినిధి/ జనవరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం క్రికెట్ టోర్నమెంట్ లొ గొల్లపల్లి జట్టు ఘన విజయం సాధించింది ఎన్నికల సందర్భంగా క్రీడాకారులు, యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు మరోసారి తన మాటకు కట్టుబాటును చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో తిప్పాపూర్ – గొల్లపల్లి జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో గొల్లపల్లి జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) గారు, ఉపసర్పంచ్ ఓరుపుల లక్ష్మన్ గారు అభినందించారు. అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీసరగండ్ల అనిల్ కుమార్ గారు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ గారు, కేటీఆర్ సేన అధ్యక్షులు ఓరుపుల రాములు గారు, యువ నాయకులు పొట్ల అనిల్ గారు పాల్గొని క్రీడాకారులను ప్రశంసించారు. గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు గ్రామాల్లో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని నాయకులు తెలిపారు.

