కామారెడ్డి,01 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు 18 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తి పారవశ్యాన్ని చాటుతున్నారు.నిత్య పూజలు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీ దుర్గామా తకు ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తర శత నామార్చ న సహస్ర నామార్చన వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నారు. అలంకరణ వైభవం ప్రతి రోజు అమ్మవారిని ఒక ప్రత్యేక నవదుర్గ అవతారంలో అలంకరించి, ఆ రూపానికి తగిన పూజలను, నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఈ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి.ముగింపు వేడుకల సంధర్భంగా ఉత్సవా ల చివరి రోజున మహిషాసురమర్దని అలంకరణ, సామూహిక యజ్ఞాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఈ యజ్ఞంలో 20 మంది దంపతులు జంటగా పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నా రు.


