నంద్యాల యాదవుల కార్తీక వనభోజన మహోత్సవాన్ని కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణుని మందిరం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో హిందూ సాంప్రదాయంలో వనభోజన కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని. ఈ కార్యక్రమంలో యాదవ సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని, కలిసి భోజనాలు చేస్తూ, ఆధ్యాత్మిక చర్చలతో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి చాలా సంతోషంగా ఉందన్నారు. యాదవ సంఘటిత శక్తిని చాటిచెప్పిన ఈ యాదవ కార్తీక వనభోజన మహోత్సవం మత సామరస్యాన్ని, సామాజిక ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తూ, అందరిలో ఆధ్యాత్మిక భావనను పెంచిందన్నారు
ఈ కార్యక్రమంలో యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్,కొండా శ్రీనివాస్ యాదవ్, నాగేశ్వరరావు యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , హరి యాదవ్, భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , నాగరాజు యాదవ్, నాగమధు యాదవ్, శివ కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొనారు


