యాకసిరి చెరువు ఆక్రమణల తొలగింపు

0
239

నాయుడుపేట, జూన్‌ 10, 2020 (‌పున్నమి విలేఖరి) : చెరువు లోతట్టు ఆక్రమణ… రెండు మండలాల మధ్య వివాదాన్ని రేపింది. ఆయకట్టు రైతులకు, ఆక్రమణ దారులకు మధ్య ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఉద్రిక్తిత పరిస్థి తులు నెలకొన్నాయి. భారీ ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు, నాయుడుపేట మండలాల సరిహ ద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జిల్లాలోని చిట్టమూరు మండలం యాకసిరి, పాటిమిట్ట, గునపాటిదిబ్బ, కృష్ణమనాయుడు కండ్రిగ గ్రామాలకు చెందిన చెరువు లోతట్టును నాయుడుపేట మండలం పుదూరు పంచాయతీలోని అత్తల పాలెం, అమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు చెరువును ఆక్ర మించారు. లోతట్టులో దాదాపు 215 ఎకరాల భూమిని ఆక్రమించి సాగుచేశారు. దీంతో ఏకసిరి చెరువు ఆయకట్టు సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. దాదాపు 2500 ఎకరాల ఆయకట్టు కలిగిన యాకసిరి చెరువు ఆక్రమణల పై ఆయకట్టు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవేళ నాయు డుపేట, వాకాడు సీఐల ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, పదుల సం ఖ్యలో పోలీసులు పహారా ఏర్పా టు చేసి ఆక్రమణల తొలగింపు చేపట్టారు చిట్టమూరు రెవిన్యూ అధికారులు. దీంతో ఆక్రమిత రైతులు అడ్డుకున్నారు.
ఈ సంద ర్భంగా ఆక్రమణదారులు, ఆయ కట్టు రైతుల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంది. చెరువును ఆక్రమిస్తే తమ ఆయకట్టుకు ఇబ్బందని చిట్టమూరు ఆయకట్టు రైతులు చెబుతుండగా, తాము సాగుచేసిన పొలాన్ని పంట చేతి కందే వరకు ఉంచాలంటూ ఆక్రమణ దారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆక్ర మణలు తొలగిస్తున్న ప్రొక్లయిన్లకు ఆక్రమణదారులు అడ్డుపడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీ సులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయుడుపేట, వాకాడు సీఐలతో పాటు గూడూరు డిఎస్పీ అక్కడి పరిస్థితిని సమీక్షించారు. 1942కు పూర్వం వెంకటగిరి రాజా సంస్థానంలో ఉన్నప్పటి నుంచి చెరువు లోతట్టును తాము సాగుచేసుకుంటున్నామని ప్రస్తుతం వ్యవహారం కోర్టులో వున్నందున గడువు ఇవ్వాలని ఆక్రమణ దారులు చెబుతున్నారు. దీనిని చిట్టమూరు రెవిన్యూ అధికారులు తోసి పుచ్చుతున్నారు. చెరువును ఆక్రమిం చడమే చట్టరీత్యా నేరమైనప్పుడు తిరిగి దానిని కొనసాగించడం ఎంత వరకు సబబని చిట్టమూరు డిప్యూటీ తహసి ల్దారు చెప్పారు. పుదూరు ప ంచాయతీ లోని రైతులు చెరువును ఆక్రమించడం వల్ల ఆరు గ్రామాలకు జీవనాధారం 2500 ఎకరాల ఆయకట్టు కలిగిన తాము తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నామని అక్కడి రైతులు పేర్కొం టున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న యాకసిరి చెరువు ఆయు కట్ట ఆక్రమణ వ్యవహారం ఇవాళ తీవ్ర రూపం దాల్చడంతో ఉద్రిక్త వాతా వరణం నెలకొంది. ఒకవైపు ఆక్రమ ణదారులు, ఇంకోవైపు ఆయకట్టు రైతులు వాదోపవాదాలకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెకొంది. ఎట్టిపరిస్థితుల్లోను ఆక్రమణలను
ఉపేక్షించబోమని రెవిన్యూ అధికారులు తెగేసి చెప్పారు.

0
0