Thursday, 5 February 2026
  • Home  
  • *యస్.బి.ఐ.టి. లో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల హ్యకథాన్*
- ఖమ్మం

*యస్.బి.ఐ.టి. లో ఘనంగా ప్రారంభమైన రెండు రోజుల హ్యకథాన్*

ఖమ్మం పున్నమి ప్రతి నిధి రేపటి సమస్యలకు నేడే పరిష్కారం కనుగొనడం హ్యకథాన్ లక్ష్యం అని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండు రోజుల అంతర్గత హ్యకథాన్ కు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆలోచనలను కోడ్ రూపంలోకి మార్చడంలో హ్యాకథాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు ఐడియాధాన్, హ్యకథాన్ వంటి పోటీలలో చురుకుగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కళాశాలలోని ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ద్వారా లాంచ్ ప్యాడ్ 1.0 పేరుతో నిర్వహించిన హ్యకథాన్లో 35 బృందాలు పాల్గొనగా, విజేతలకు రానున్న రోజులలో నిర్వహించబోయే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలను అందిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య మాట్లాడుతూ విద్యార్థులలోని ఆలోచనలకు పూర్తి రూపాన్ని అందించి, ఆచరణలోకి తీసుకురావడం హ్యకథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులలోని సృజనాత్మకత ఆలోచింపజేసే రీతిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యతో పాటు ఆధునిక సాంకేతిక రంగాలలో జరుగుతున్న మార్పులను అలవర్చుకొని ఇటువంటి వినూత్న పోటీల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నూతన ఆవిష్కరణలను వెలికి తీయగలమని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. అటానమస్, న్యాక్ ఏ+ హోదా తమ భాధ్యతను మరింతగా పెంచాయని, అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి ఐడియాధాన్ నిర్వహించామని గుర్తు చేసారు. హ్యాకథాన్ రెండవ రోజున విజేతలను ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ఇంచార్జ్ డా॥ మురళీ మోహన్, పి. అశ్విని, అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, విభాగాధిపతులు డా॥ అమిత్ బింధాజ్, డా॥ చరణ్ సింగ్, డా॥ సుప్రియ, డా॥ స్పూర్తి, డా॥ పద్మావతి, డా॥ పి. రామకృష్ణ, యస్. నాగమణి, డా|| జి. ప్రభాకర్, టి.పి.ఒ. యన్. సవిత తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం
పున్నమి ప్రతి నిధి

రేపటి సమస్యలకు నేడే పరిష్కారం కనుగొనడం హ్యకథాన్ లక్ష్యం అని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన రెండు రోజుల అంతర్గత హ్యకథాన్ కు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించారు. హాజరైన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆలోచనలను కోడ్ రూపంలోకి మార్చడంలో హ్యాకథాన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే విద్యార్థులు ఐడియాధాన్, హ్యకథాన్ వంటి పోటీలలో చురుకుగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు.

కళాశాలలోని ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ద్వారా లాంచ్ ప్యాడ్ 1.0 పేరుతో నిర్వహించిన హ్యకథాన్లో 35 బృందాలు పాల్గొనగా, విజేతలకు రానున్న రోజులలో నిర్వహించబోయే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశాలను అందిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య మాట్లాడుతూ విద్యార్థులలోని ఆలోచనలకు పూర్తి రూపాన్ని అందించి, ఆచరణలోకి తీసుకురావడం హ్యకథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులలోని సృజనాత్మకత ఆలోచింపజేసే రీతిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

విద్యతో పాటు ఆధునిక సాంకేతిక రంగాలలో జరుగుతున్న మార్పులను అలవర్చుకొని ఇటువంటి వినూత్న పోటీల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నూతన ఆవిష్కరణలను వెలికి తీయగలమని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. అటానమస్, న్యాక్ ఏ+ హోదా తమ భాధ్యతను మరింతగా పెంచాయని, అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి ఐడియాధాన్ నిర్వహించామని గుర్తు చేసారు. హ్యాకథాన్ రెండవ రోజున విజేతలను ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెల్ ఇంచార్జ్ డా॥ మురళీ మోహన్, పి. అశ్విని, అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, విభాగాధిపతులు డా॥ అమిత్ బింధాజ్, డా॥ చరణ్ సింగ్, డా॥ సుప్రియ, డా॥ స్పూర్తి, డా॥ పద్మావతి, డా॥ పి. రామకృష్ణ, యస్. నాగమణి, డా|| జి. ప్రభాకర్, టి.పి.ఒ. యన్. సవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.