Sunday, 22 March 2026
  • Home  
  • యల్లటూరు శివరామరాజు నేతృత్వంలో ‘రైతన్నా! మీ కోసం’ – పథకాలపై రైతులకు పూర్తి వివరాలు
- అన్నమయ్య

యల్లటూరు శివరామరాజు నేతృత్వంలో ‘రైతన్నా! మీ కోసం’ – పథకాలపై రైతులకు పూర్తి వివరాలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఊటుకూరు పంచాయతీలో బుధవారం “రైతన్నా! మీ కోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది.అన్నదాత సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు,మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్ పాల్గొన్నారు.రైతులకు పథకాలను అందించే విధానం,వాటి ప్రయోజనాలు వివరించే కరపత్రాలను ప్రజల్లో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ ఇకపై రైతును అన్నదాత అన్న మాటకు తగిన గౌరవంతో నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.నీటి భద్రతా కార్యక్రమాలు, డిమాండ్ ఆధారిత పంటల ప్రోత్సాహం,శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ వంటి ఆధునిక వ్యవసాయ చర్యలను సమర్థంగా అమలు చేస్తోంది అని తెలిపారు.అలాగే అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ వంటి పథకాలలో రైతులు ఎదుర్కొంటున్న భూముల నమోదు లోపాలు,ఆధార్ లింక్ సమస్యలు మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ నాగలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిరీష, రాజేశ్వరి,పద్మ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ అచ్యుత్ పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పెడకాల సుధాకర్,లక్ష్మీపతి రాజు,పెడకాల వెంకటసుబ్బయ్య,మలిశెట్టి వెంకటరమణ,సంబారు రాజశేఖర్, చల్లా వెంకటేష్,సగినాల వేణుగోపాల్ రాజు, అయ్యప్ప హరిరాజు, లవిడి ఈశ్వర్ రాజు, సమ్మెట సుబ్బరాజు, సంబారు ఓబులేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు.రైతు సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి, పరిష్కారం దిశగా ముందడుగు వేసే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరొకసారి ప్రజలకు చేరవేసింది.

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఊటుకూరు పంచాయతీలో బుధవారం “రైతన్నా! మీ కోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది.అన్నదాత సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు,మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్ పాల్గొన్నారు.రైతులకు పథకాలను అందించే విధానం,వాటి ప్రయోజనాలు వివరించే కరపత్రాలను ప్రజల్లో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ
ఇకపై రైతును అన్నదాత అన్న మాటకు తగిన గౌరవంతో నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.నీటి భద్రతా కార్యక్రమాలు, డిమాండ్ ఆధారిత పంటల ప్రోత్సాహం,శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ వంటి ఆధునిక వ్యవసాయ చర్యలను సమర్థంగా అమలు చేస్తోంది అని తెలిపారు.అలాగే అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ వంటి పథకాలలో రైతులు ఎదుర్కొంటున్న భూముల నమోదు లోపాలు,ఆధార్ లింక్ సమస్యలు మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ నాగలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిరీష, రాజేశ్వరి,పద్మ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ అచ్యుత్ పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పెడకాల సుధాకర్,లక్ష్మీపతి రాజు,పెడకాల వెంకటసుబ్బయ్య,మలిశెట్టి వెంకటరమణ,సంబారు రాజశేఖర్, చల్లా వెంకటేష్,సగినాల వేణుగోపాల్ రాజు, అయ్యప్ప హరిరాజు, లవిడి ఈశ్వర్ రాజు, సమ్మెట సుబ్బరాజు, సంబారు ఓబులేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు.రైతు సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి, పరిష్కారం దిశగా ముందడుగు వేసే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరొకసారి ప్రజలకు చేరవేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.