భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు జన్మదినం సందర్బంగా మంగళవారం నంద్యాల మునిసిపల్ టౌన్ హాల్ లో మైనారిటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన మౌలానా ఆజాద్ జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయుడు, అబ్దుల్ మజీద్
ఘనంగా సన్మానించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనారిటీ సంక్షేమశాఖ అధికారిణి సబిహా పర్వీన్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్, డీఈఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ముస్లిం మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ అబ్దుల్ మజీద్ పాత్రికేయ వృత్తిలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధికి దోహద పడుతున్నారని కొనియాడారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్బంగా సీనియర్ పాత్రికేయుడు అబ్దుల్ మజీద్ కు సన్మానం
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు జన్మదినం సందర్బంగా మంగళవారం నంద్యాల మునిసిపల్ టౌన్ హాల్ లో మైనారిటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన మౌలానా ఆజాద్ జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయుడు, అబ్దుల్ మజీద్ ఘనంగా సన్మానించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనారిటీ సంక్షేమశాఖ అధికారిణి సబిహా పర్వీన్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్, డీఈఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ముస్లిం మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ అబ్దుల్ మజీద్ పాత్రికేయ వృత్తిలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధికి దోహద పడుతున్నారని కొనియాడారు.

