నంద్యాల ఈనెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ టిడిపి నాయకురాలు కత్తి శ్రావణి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పర్యటన రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కొత్త ఊపును అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికల గురించి ప్రత్యక్షంగా వినే అవకాశం ఈ సభ ద్వారా లభిస్తుంది. అందుకే ప్రతి గ్రామం, ప్రతి వాడా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరవ్వాలని కోరుతున్నాను” అని కత్తి శ్రావణి రెడ్డి అన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మంత్రి ఫరూక్, భూమా అఖిలప్రియ మార్గదర్శకత్వంలో కూటమి శ్రేణులు, సభను విజయవంతం చేయాలని కోరారు.

మోదీ సభను విజయవంతం చేద్దాం: కత్తి శ్రావణి రెడ్డి